భక్త జన కోటికి ఆపద్భాందవుడు, కోరిన కోరికలు నెరవేర్చే దయాహృదయుడు . శ్రీ కోదండరామ్ నగర్ ప్రసన్నా౦జనేయుడు.1978 వ సంవత్సరం లో కాలనీ వాసులచే నిర్మించబడిన దేవాలయము శ్రీ ప్రసన్నా౦నేయ స్వామి కృపతో దినదినాభివ్రుధి చెందుతూ ప్రతి సంవత్సరం పెద్ద ఉత్సవాలు జరుపుకునే స్థాయీకి ఎదిగింది. ఆలయ ప్రా౦గణ౦లోనే నవగ్రహాల ప్రతిష్ట, ధ్యాన కేంద్రం , పూజారులకు నివాస గృహం ఇలా ప్రసన్నా౦నేయ స్వామి దేవాలయం అభివృధికి చిరునామాగా మారి విశిష్ట దేవాలయంగా పేరుగాంచినది.

గత సం: 2016 దేవాలయ ప్రా౦గణము అభివ్రుదికై ప్రక్యాన గల 250 గాజాల స్థలము రూపాయులు 80 లక్షలతో సేకరించుట జరిగినది. అనేకమంది మీ వంటి భక్తులు విరాలములతో అది సాధ్యమైనది. స్వామి దయతో ఆ స్థలము నందు ప్రస్తుతం నిర్మాణము చేపట్టడం జరిగినది .ప్రస్తుతం రెండ౦తస్తులు కట్టి భవిష్యత్తులో మరో రెండ౦తస్తుల నిర్మాణమునకు పునాదులు వేసి పిల్లర్స్ పని జరుగుతున్నది. ప్రస్తుత నిర్మాణమునకు రూ 80 లక్షలు కర్చు అవుతు౦నది అంచనా .కావున మీరు దయతో స్వామి వారి ప్రా౦గణ నిర్మాణముకు విరాళములు ఇచి ఆంజనేయుని కటాక్షములు పొందగలరని ప్రార్థన

భక్తులకు తమ శక్తి కొలది ఈ దేవుని కార్యక్రమములో తమ వంతు పాత్రగా విరాళములు ఇచి దేవుని ఇల్లు కట్టడంలో భాగస్తులు కావాలని మా మనవి . ఈ క్రింది విధముగా విరాళములు ఇచ్చిన వారి పేర్లు శీలా ఫలకము పై శాశ్వతముగా చెక్కబడి భావి తరాల వారికీ భక్తి భావము కల్పించుట జరుగును.

భక్తులకు తమ శక్తి కొలది ఈ దేవుని కార్యక్రమములో తమ వంతు పాత్రగా విరాళములు ఇచి దేవుని ఇల్లు కట్టడంలో భాగస్తులు కావాలని మా మనవి . ఈ క్రింది విధముగా విరాళములు ఇచ్చిన వారి పేర్లు శీలా ఫలకము పై శాశ్వతముగా చెక్కబడి భావి తరాల వారికీ భక్తి భావము కల్పించుట జరుగును.

ప్రస్తుతం నిర్మాణ౦ లో ఉన్నా భవనం నందు చేయాబోయే కార్యక్రమములు

 • రెండ౦తస్థూలలొ పెద్ద హాల్స్
 • హోమ గుండాల ఏర్పాటు
 • సత్యనారాయణస్వామి వ్రతాలు
 • గణేష్ ,నవరాత్రి ఉత్సవములలో విగ్రహస్థాపన
 • బతుకమ్మ పండుగల , దా౦డియా వగైరా
 • అన్నదాన కార్యక్రమాలకు వినియోగించుట
 • పంచాంగశ్రవనం, పూరాణాల పటనం , జపాలు కావించడం
 • ఇతర దైవ సేవా కార్యక్రమాలు

పండుగ పర్వదినాల్లో మరియు ప్రత్యేక రోజుల్లో జరిగే పూజా వివరాలు

 • నూతన సంవత్సరాని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు
 • సంక్రాతి సమయంలో ఆంజనేయ స్వామి వారికి ప్రత్యేకంగా వెన్నెల౦కరణ మరియు పూజలు
 • ఉగాది చైత్రశుద్ధ పాడ్యమి రోజున పంచాగ శ్రవణం మరియు పచ్చడి వితరణ
 • శ్రీరామ నవమి రోజున స్వామి వారి కళ్యాణం మరియు అన్నాదాన వితరణ హనుమాన్ జయంతి రోజున ప్రత్యేక పూజలు , పగలు అన్నదానం మరియు ఊరేగి౦పు
 • వినాయక చవితి రోజున విగ్రహ ప్రతిష్ట ,9 రోజులు ఉత్సవాలు , లక్ష్మి గణపతి హోమం నిర్వహణ
 • ప్రతి నెల అమావాస్య ముందు ఆదివారం మన్యుసూక్త హోమం
 • శనిత్రయోదశి రోజున శనితైలాభిషేకాలు , శనిపూజలు
 • దీపావళికి ప్రత్యేక దీపాల౦కరణ కార్తిక పౌర్ణమి రోజున దీపాల౦కరణ
 • ప్రతి నెల పౌర్ణమి నాడు సత్యనారాయణ స్వామి వ్రతాలు
 • మహాశివరాత్రి పర్వదినాన స్వామి వారికీ పంచామృత అభిషేకం
 • ప్రత్తి మంగళ , శనివారాల్లో విశేషంగా స్వామివారి అభిషేకాలు , ఆకు పూజా , వడమాల సమర్పణ . సింధూర పూజా స్వామి వారికీ వడమాల సమర్పణ వలన కోరుకున్న కోరికలు నేలవేరటం వలన భక్తులు మల్లి మల్లి వడమాల సమర్పణలు .
 • ప్రతి రోజు సాయంత్రం హనుమాన్ చాలీసా పటనం, భజన కార్యక్రమాలు

విరాళ వివరాలు

 • 25,000 – పోషకులు
 • 50,000 – రాజ పోషకులు
 • 1,00,000 – మహా రాజ పోషకులు
 • 2,00,000 – ప్రముఖదాత
 • 5,00,000 – మహాదాత
 • 10,00,000 – భూరివిరాళము

దాతల పేరుతో నిత్య నామార్చనము ప్రతేక పూజలలో సంకల్పము చేయబడును . విరాళములు ఇచ్చు వారు దేవాలయములో ఇచ్చి గాని ట్రస్టీ ల ద్వారా ఇచ్చి గాని తగిన రసీదు పొందగలరు . ఇతర భక్తులు 5 వేలు ఆ పై ఇచ్చు వారు దేవాలయము లో రసీదు పొందగలరు . మీకు తోచినoత హుండిలో కూడా వేయగలరు.

Name : Sri Prasannanjaneya swamy temple trust
A/C No : 1456155000083753
Bank : Karur Vysya Bank, Dilshuknagar, Hyderabad.
IFSC : KVBL0001456