1
slider1
2
SLIDER3
SLIDER3
slider2

ఆంజనేయ శ్లోకం

శ్రీ ఆంజనేయం మహావీరం
బ్రహ్మ విష్ణు శివాత్మకం
బాలార్క సదృశాబాసం
శ్రీ రామ దూతం శిరసా నమామి నమాయ్యహం.

ప్రతిరోజు కనీసం పదిసార్లు చదువుకున్న వారికీ కష్టాలన్నీ తొలిగిపోతాయి

భక్త జన కోటికి ఆపద్భాందవుడు, కోరిన కోరికలు నెరవేర్చే దయాహృదయుడు . శ్రీ కోదండరామ్ నగర్ ప్రసన్నా౦జనేయుడు.1978 వ సంవత్సరం లో కాలనీ వాసులచే నిర్మించబడిన దేవాలయము శ్రీ ప్రసన్నా౦నేయ స్వామి కృపతో దినదినాభివ్రుధి చెందుతూ ప్రతి సంవత్సరం పెద్ద ఉత్సవాలు జరుపుకునే స్థాయీకి ఎదిగింది. ఆలయ ప్రా౦గణ౦లోనే నవగ్రహాల ప్రతిష్ట, ధ్యాన కేంద్రం , పూజారులకు నివాస గృహం ఇలా ప్రసన్నా౦నేయ స్వామి దేవాలయం అభివృధికి చిరునామాగా మారి విశిష్ట దేవాలయంగా పేరుగాంచినది.
గత సం: 2016 దేవాలయ ప్రా౦గణము అభివ్రుదికై ప్రక్యాన గల 250 గాజాల స్థలము రూపాయులు 80 లక్షలతో సేకరించుట జరిగినది. అనేకమంది మీ వంటి భక్తులు విరాలములతో అది సాధ్యమైనది. స్వామి దయతో ఆ స్థలము నందు ప్రస్తుతం నిర్మాణము చేపట్టడం జరిగినది .ప్రస్తుతం రెండ౦తస్తులు కట్టి భవిష్యత్తులో మరో రెండ౦తస్తుల నిర్మాణమునకు పునాదులు వేసి పిల్లర్స్ పని జరుగుతున్నది. ప్రస్తుత నిర్మాణమునకు రూ 80 లక్షలు కర్చు అవుతు౦నది అంచనా .కావున మీరు దయతో స్వామి వారి ప్రా౦గణ నిర్మాణముకు విరాళములు ఇచి ఆంజనేయుని కటాక్షములు పొందగలరని ప్రార్థన
భక్తులకు తమ శక్తి కొలది ఈ దేవుని కార్యక్రమములో తమ వంతు పాత్రగా విరాళములు ఇచి దేవుని ఇల్లు కట్టడంలో భాగస్తులు కావాలని మా మనవి . ఈ క్రింది విధముగా విరాళములు ఇచ్చిన వారి పేర్లు శీలా ఫలకము పై శాశ్వతముగా చెక్కబడి భావి తరాల వారికీ భక్తి భావము కల్పించుట జరుగును.